మంత్రి కేటీఆర్ చేపట్టిన గ్రీన్ ఫ్రైడే కార్యక్రమానికి వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఉద్యమంలా ప్రారంభమైంది. గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
'గ్రీన్ ఫ్రైడే'లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. హరితహారం ద్వారా ప్రజలందరూ మొక్కలు నాటి... వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు.
'గ్రీన్ ఫ్రైడే'లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రణాళికలు చేశారని వినయ్ భాస్కర్ అన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలు తీసుకుంటే.. రానున్న తరాలకు మంచి వాతావరణం అందించిన వారిమవుతామని ఆయన అన్నారు.