వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
హన్మకొండలో జెండా ఆవిష్కరించిన చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ - chief whip vinay bhaskar in republic day celebrations
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా సాగాయి. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
హన్మకొండలో గణతంత్ర వేడుకలు
క్యాంపు ఆఫీసులో వినయ్ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి :ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్