మంత్రి కేటీఆర్ పిలుపుతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి 108 వాహనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్షణమే వైద్య సాయం అందించేందుకు ఈ వాహనం బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
వైద్య రంగానికి తెరాస పెద్దపీట: చీఫ్ విప్ - వరంగల్ జిల్లా వార్తలు
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ అందజేశారు. పేదలకు వైద్య సాయం అందించడానికి ఈ వాహనం చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌తో కలిసి అంబులెన్స్‌ను ప్రారంభించారు.
వైద్య రంగానికి తెరాస పెద్దపీట: ప్రభుత్వ చీఫ్ విప్
వైద్య రంగానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:కొవిడ్‌కు సరికొత్త చికిత్స కనుగొన్న తెలంగాణ తేజం...