నిరుపేద కుటుంబానికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యామలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన చీఫ్ విప్ - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన చీఫ్ విప్
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 139 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందజేశారు.
![కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన చీఫ్ విప్ kalyan lakshmi cheque distribution by mla vinay bhskar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8393735-846-8393735-1597241942252.jpg)
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన చీఫ్ విప్
మొత్తం 139 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'