పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా) వారి ప్రోత్సాహంతో వరంగల్ నగరపాలక సంస్థ సహకారంతో నాప్కిన్స్ తయారీని ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక బృంద సభ్యులతో హసన్‌పర్తిలో ఏర్పాటు చేసిన సానిటరీ నాప్కిన్స్ కేంద్రం నుంచి 'చెలి' సానిటరీ ఉత్పత్తులను తొలిసారిగా ముంబయికి ఎగుమతి చేస్తోంది.
'చెలి' సానిటరీ ఉత్పత్తులు ముంబయికి ఎగుమతి - 'చెలి' సానిటరీ ఉత్పత్తులు ముంబాయికి ఎగుమతి
వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తిలో ఏర్పాటు చేసిన సానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్ర నుంచి ఉత్పత్తులు తొలిసారిగా ముంబయికి ఎగమతి కానున్నాయి. ఓ ఎన్జీవో సంస్థ ఇచ్చిన ఆర్డర్లో భాగంగా 500 న్యాప్కిన్స్ ముంబయికి పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'చెలి' సానిటరీ ఉత్పత్తులు ముంబయికి ఎగుమతి
ముంబయికి చెందిన ఎన్జీఓ ఆర్గనైజేషన్‌కు చెందిన మహేంద్రసింగ్ అక్కడి మురికివాడల్లో నివసిస్తున్న బాలికలు, మహిళలకు స్వచ్ఛందంగా అందజేయడానికి 500 నాప్కిన్స్ ఆర్డరిచ్చారు. 6 నాప్కిన్లు గల ప్యాకెట్ ధర రూ.35కి విక్రయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడి ఉత్పత్తులకు ముంబయిలో క్రమక్రమంగా ఆదరణ పెరుగుతుందని తద్వారా సిబ్బందికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.