తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నించడం ప్రజల హక్కు: వినయ్ భాస్కర్ - తెలంగాణ వార్తలు

అభివృద్ధి కోసం నిరసన తెలపడం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గత నెలలో బోడగుట్ట ప్రాంతంలో స్థానికులు ఆందోళన చేశారని.. వెంటనే వారి సమస్యలను తీర్చడానికి నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు.

cheap whip dasyam vinay bhaskar comments on kazipet
అభివృద్ధి కోసం నిరసన తెలపడం ప్రజల హక్కు: దాస్యం

By

Published : Jan 22, 2021, 4:20 PM IST

ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి కోసం నిరసన తెలపడం ప్రజల హక్కు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సైతం గుర్తించాలని తెలిపారు. ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ఎంపీ పసునూరి దయాకర్​తో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం బోడగుట్ట ప్రాంతంలో ఆయన పర్యటించారు. రూ. 3 కోట్ల 39 లక్షల నిధులతో 36 వ డివిజన్​లో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు.

నిరసన చేశారు నిధులు తెప్పించాం..

గత నెలలో బోడగుట్ట ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కొత్త ట్రాన్స్ఫార్మర్, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం స్థానికులు నిరసన చేశారని చీఫ్ విప్ గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం నుంచి వారు కోరిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసి తీసుకొచ్చామని తెలియజేశారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన విషయాన్ని ఎంపీతో కలిసి రైల్వే డీఆర్ఎమ్​తో చర్చించామని వెల్లడించారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేయించి బ్రిడ్జీ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details