రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైకోర్టు సూచనతో సమ్మె విరమించి సేవ్ ఆర్టీసీ పేరిట విధుల్లో చేరేందుకు వెళుతున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేస్తే సహించేది లేదని చెప్పిన చాడ.. రైతులకు రెవెన్యూ అధికారుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు.
'రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది' - rtc strike news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నియంతృత్వ పాలన