నేరాల నియంత్రణకు పోలీసు, ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ గోపాల్పూర్ శ్రీనివాస కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'నేరాల నియంత్రణకు పోలీసులు, ప్రజా భాగస్వామ్యం ముఖ్యం' - Greater Warangal Latest News
నేరాల నియంత్రణకు పోలీసులు, ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ పట్టణం శ్రీనివాస కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. నిరంతరం నిఘాతో నేరగాళ్లను సులువుగా పట్టుకోవచ్చని తెలిపారు.
సీసీ కెమెరాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
సీసీ కెమెరాల నిరంతర నిఘా ఉండడం వల్ల ఏదైనా ఘటన జరిగినప్పుడు సాక్ష్యాలు సులువుగా దొరుకుతాయని తెలిపారు. పుటేజీ ద్వారా ఆధారాలు సేకరించవచ్చని వెల్లడించారు. నేరస్థులను సులువుగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:గంగపుత్రులను బాధపెట్టే వ్యాఖ్యలు చేయలే.. : తలసాని
TAGGED:
గ్రేటర్ వరంగల్ తాజా వార్తలు