తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజనల్​ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలి : పమేలా సత్పతి - వరంగల్​ కమిషనర్​ అధికారుల సమావేశం

సీజనల్​ వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్​​ కౌన్సిల్ హాల్​లో ప్రజారోగ్య విభాగం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

పమేలా సత్పతి
పమేలా సత్పతి

By

Published : May 9, 2020, 10:01 PM IST

వరంగల్​ నగరంలోని మురికి కాలువల్లో మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సానిటరీ ఇన్స్​పెక్టర్​లకు వరంగల్​ కార్పొరేషన్​ కమిషనర్ పమేలా సత్పతి సూచించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష అనంతరం... కార్పొరేషన్​ కౌన్సిల్​హాల్​లో ప్రజారోగ్య విభాగం అధికారులతో కమిషనర్​ సమావేశం నిర్వహించారు.

వర్షాకాలం రాకముందే వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని నాళాలలో గల చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్​ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముమ్మర ప్రచారం చేయాలని చెప్పారు.

ఇవీచూడండి:యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details