గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. నేడు చివరి రోజు కావటంతో కార్యకర్తలతో తరలొచ్చిన అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. ఎల్‌వీ కళాశాల, హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా కోలాహలం నెలకొంది. అభ్యర్థులు డప్పు చప్పుళ్లు, బైక్‌ర్యాలీలు, ప్రదర్శనలతో నామినేషన్ కేంద్రాల వద్దకు తరలొచ్చారు.
వరంగల్‌లో చివరి రోజు పోటెత్తిన నామినేషన్లు - వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు
నేడు ఆఖరి రోజు కావటంతో గ్రేటర్ వరంగల్ పరిధిలో నామినేషన్లు వెల్లువెత్తాయి. వరంగల్ ఎల్‌వీ కళాశాల, హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా కోలాహలం నెలకొంది.
![వరంగల్‌లో చివరి రోజు పోటెత్తిన నామినేషన్లు nominations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11449428-570-11449428-1618742117706.jpg)
నామినేషన్లు
తెరాస, భాజపా, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామనేషన్లు దాఖలు చేశారు. తెదేపా, వామపక్షాలు, జనసేన అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. తెరాస మేయర్ అభ్యర్థిగా తాజాగా తెరపైకొచ్చిన మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం వరకు 250 వరకు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి