వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి మడికొండ నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై బయలుదేరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా మడికొండ నుంచి రైతులు ఎడ్లను అందంగా అలంకరించి స్వామి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.
బండెనక బండి కట్టి... శివయ్య సన్నిధికెళ్లి.... - kothakonda veerabhadra swamy jatara
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో రైతులు పోటీకి సిద్ధంగా ఉంటారు. ఎడ్లను అందంగా అలంకరించి భక్తి పారవశ్యంతో ఎడ్ల బండ్ల పోటీల్లో పాల్గొంటారు. తమ గ్రామం నుంచి బయలుదేరి దైవ దర్శనానికి పోటీగా బయలుదేరుతారు.
దైవదర్శనానికి ఎడ్ల బండ్ల పోటీలు
కోరిన కోర్కెలు తీర్చే వీరభద్రునికి గుమ్మడికాయలు, కోర మీసాలు సమర్పించి తమ కుటుంబాలను చల్లంగా చూడమని భక్తులు కోరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు తమ గ్రామం నుంచి బయలుదేరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని.. రాత్రంతా దేవాలయ ప్రాంగణంలోనే గడిపి మరుసటి రోజు తిరుగు పయనమవుతారు.
ఇదీ చూడండి :రాములోరి సన్నిధిలో భక్తుల కోలాహలం