BTech Student Committed Suicide In Warangal: వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని.. తన బాబాయి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతుల కూతురు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది.
స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ ఇటీవల వేధిస్తున్నాడు. గతంలో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేశాడు. ఇదే విషయాన్ని రక్షిత కుటుంబసభ్యులకు చెప్పగా, వారు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు. రాహుల్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవల రాహుల్ వేధింపులు ఇంకా శ్రుతి మించాయి.
BTech Student Rakshitha Commit Suicide: ఈ ఘటన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత... కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరింది. కానీ ఆమె కళాశాలకు వెళ్లలేదు. తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని, భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కూతురు ఇంటికి వచ్చిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హాస్టల్‌లో వద్దని తండ్రి శంకర్.. రక్షితను వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి పంపించాడు. మిస్సింగ్ కేసు విషయంలో ఇవాళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా.. ఆదివారం రక్షిత ఆత్మహత్యకు పాల్పడింది. రక్షిత తండ్రి కాంట్రాక్ట్ పని మీద ఝార్ఖండ్ వెళ్లారు. రాహుల్ వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి రమాదేవి మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి (రమాదేవి) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వరంగల్‌లో వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఇవీ చదవండి: