Boy Killed in School Bus Accident Hanamkonda :ఈ మధ్య కాలంలో తరచూ గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు, బస్సుల కింద పడి అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందుతున్నారు. ఇది వరకే ఇలాంటి ప్రమాదాలు జరిగినా పునరావృతం (Road Accidents) కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడానికి పిల్లల్ని బయటకు తీసుకువెళుతున్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా..? అధికారుల వైఫల్యమా లేక వారు చర్యలు తీసుకున్న ప్రజల్లో ఉనికి లేకపోవడమో కానీ ఎంతో జీవితాన్ని అనుభవించాల్సిన చిన్నారులు కానరాని లోకాలకు వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది.
3 year Old Boy Crushed Under School Bus Warangal :హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చంటయిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలుడు శివాన్ష్ ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్ కింద పడి మృతి చెందాడు. బాలుడి మరణంతో అతడి కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజూలాగే పిల్లలిద్దరిని స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి వెళ్లింది ఆ తల్లి. పెద్దకుమారున్ని స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా అక్కడే ఉన్న తన చిన్నకుమారుడు శివాన్ష్ ప్రమాదవశాత్తు స్కూల్ వ్యాన్ టైర్ కింద పడి మృతి చెందాడు.
College Bus Hits GHMC Worker Hyderabad : కాలేజ్ బస్సు ఢీకొని GHMC కార్మికురాలు మృతి.. వీడియో వైరల్
3 Year Old Boy Killed in School Bus Accident Hanamkonda :కండ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్న కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి స్కూస్ వ్యాన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నమన్నారు స్కూల్ వ్యాన్ల కింద పడిచిన్నపిల్లలు గాయాల పాలవ్వడం, దుర్మరణం చెందడం లాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న సందర్భంలో స్కూల్ వ్యాన్ నడిపేటప్పుడు డ్రైవర్లు, పర్యవేక్షకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలని రోడ్లపైకి తీసుకువచ్చినప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.