Boy died coconut piece stuck in his throat: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కపోయి పసిపిల్లాడు మృతిచెందిన విషాద ఘటన..వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కొర్పోలు గ్రామ శివారు వెంకట్‌తండాలో చోటుచేసుకుంది. ధారావత్ మాలు, కవిత దంపతులకు మణికంఠ అనే ఏడాది బాబు ఉన్నాడు. అయ్యప్పమాల వేసుకున్న ధారవత్ మాలు.. పూజ కోసం గుడికి వెళ్లాడు.
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కొని చిన్నారి మృతి.. ఎక్కడంటే! - Boy died coconut piece stuck in his throat
Boy died coconut piece stuck in his throat: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నారి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కొని చిన్నారి మృతి.. ఎక్కడంటే!
కవిత ఇంటి పనిలో ఉండగా.. మణికంఠ కొబ్బరి ముక్క తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి శ్వాస ఆడలేదు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతిచెందాడు. కళ్ల ముందే చిన్నారిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వెంకట్‌తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి:
Last Updated : Dec 5, 2022, 2:21 PM IST