తెలంగాణ

telangana

ETV Bharat / state

బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం.. మహిళల సంబురాలు - BODDEMMA FESTIVAL STARTED... WOMEN ARE CELEBRATING

ఆధునిక విధానాలు ఎన్ని వచ్చినా తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. బతుకమ్మకు ముందు జరుపుకునే బొడ్డెమ్మ వేడుకలను హన్మకొండలో ఘనంగా జరుపుకున్నారు.

BODDEMMA FESTIVAL STARTED... WOMEN ARE CELEBRATING

By

Published : Sep 20, 2019, 11:37 AM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుట్టమన్నుతో గౌరమ్మను తయారుచేసి వివిధ రకాల పూలతో అలకరించి మహిళలంతా కొలిచారు. బొడ్డెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ... బతుకమ్మ ఆటలతో ఉల్లాసంగా గడిపారు. 9 రోజుల పాటు ఆడిన బొడ్డెమ్మను చివరి రోజు నిమజ్జనం చేస్తామని మహిళలు చేబుతున్నారు. తెలంగాణ సాంప్రదాయాలను తమ తర్వాతి తరాలకు కూడా తెలియజేసేందుకు ఈ పండగను ఘనంగా జరుపుకుంటామంటున్నారు హన్మకొండ వాసులు.

బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం.. మహిళల సంబురాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details