తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో రక్తదాన శిబిరం - ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్​పీడీసీఎల్​ సీఎండీ గోపాల్​ రావు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యుత్​ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో రక్తదాన శిబిరం
సీఎం పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో రక్తదాన శిబిరం

By

Published : Feb 17, 2020, 8:03 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు వరంగల్​లో ఘనంగా జరిగాయి. హన్మకొండలో టీఆర్​వీకేఎస్​ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. జాన్సన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎన్‌పీడీసీఎల్​ సీఎండీ గోపాల్ రావు ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అంతకుముందు కేక్​ కట్ చేసి టపాసులు పేల్చారు.

సీఎం పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో రక్తదాన శిబిరం

ABOUT THE AUTHOR

...view details