తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్​ విప్​ - warangal urban district news

వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేటలో జాక్సన్​ వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్​ హాజరై సొసైటీ సభ్యులను అభినందించారు.

blood donation camp in warangal urban district
రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్​ విప్​

By

Published : May 31, 2020, 7:09 PM IST

జాక్సన్ వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణ జిల్లా కాజీపేటలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్​భాస్కర్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడి యువకులు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు సంస్థ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో 18 సార్లు రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.

కార్యక్రమం సందర్భంగా కేక్ కట్ చేసిన చీఫ్ విప్ దాతలకు రక్తదాన పత్రాలు అందించారు. లాక్​డౌన్ కారణంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రక్త నిధులు తగ్గిపోయాయని, ఈరోజు సేకరించిన రక్తాన్ని ఎంజీఎం రక్తనిధికి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి:లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details