ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలైనా అర్పించడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ తెలిపారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు సుమారు 300 మంది రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని నగర కమిషనర్ తెలిపారు.
'ప్రజారక్షణకై ప్రాణాలర్పించడానికైనా సిద్ధమే'
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొని రక్తదానం చేశారు.
BLOOD DONATION CAMP AT KAAJIPET IN THE PART OF POLICE VAROSTHAVALU
TAGGED:
police blood donation