తెలంగాణ

telangana

ETV Bharat / state

గుప్త నిధుల కోసం.. ఇంట్లో క్షుద్ర పూజలు - వరంగల్ జిల్లాలో ఓ ఇంట్లో క్షుద్ర పూజలు

ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం.... తన ఇంట్లోనే క్షుద్ర పూజలు చేశాడు. నిధుల కోసం.. తవ్వకాలు జరిపాడు. దానితో ప్రహరీగోడ నేలకూలడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Black magic at warangal urban district
గుప్త నిధుల కోసం.. ఇంట్లో క్షుద్ర పూజలు

By

Published : Aug 17, 2020, 2:16 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా దేశాయిపేటలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. గుప్త నిధుల కోసం.. గత కొన్ని రోజులుగా పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

పూజల అనంతరం తవ్వకాలు జరపడం వల్ల ప్రహరీగోడ నేలకూలడంతో విషయం బయటకు పొక్కింది. స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోకేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గోవింద్ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ABOUT THE AUTHOR

...view details