తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాల భర్తీ కోసం రాస్తారోకో నిర్వహించిన భాజపా యువమోర్చా - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వరంగల్ నగరంలో భాజపా యువమోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

BJP Yuva Morcha
భాజపా యువమోర్చా

By

Published : Dec 29, 2020, 1:40 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేతలు వరంగల్ నగరంలో ఆందోళన చేపట్టారు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్​తో పాటు జిల్లా అధ్యక్షురాలు పద్మ అమరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'చర్చల్లో సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతాం'

ABOUT THE AUTHOR

...view details