హన్మకొండ హంటర్ రోడ్లోని భాజపా వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అస్తమయం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించిన ఒక నాయకుడిని కోల్పోవడం భారతజాతికి తీరని లోటని పద్న తెలిపారు.
'మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం దిగ్భ్రాంతికరం' - వరంగల్ అర్బన్ జిల్లా భాజపా నాయకులు ప్రణబ్‌కు సంతాపం
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం భారతజాతికి తీరని లోటని భాజపా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ పేర్కొన్నారు. వరంగల్‌లోని భాజపా కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
!['మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం దిగ్భ్రాంతికరం' bjp warangal urban leaders condolences to the pranab mukherjee death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8637733-181-8637733-1598951756326.jpg)
'మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం దిగ్భ్రాంతికరం'
పరిష్కర్తగా వారికీ మంచి పేరుందని, ఔత్సాహిక రాజకీయ నాయకులకు వారు రోల్ మోడల్ అని, అతి చిన్న వయసులోనే పెద్దల సభకు ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు ఉందని అన్నారు. భారత దేశానికి రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు అని చెప్పారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు