తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ, ఎమ్మార్వో ఆఫీసుల్లో భాజపా జాతీయ జెండా ఆవిష్కరణ - vimochana day celebrations Khila warangal latest News

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఖిలా వరంగల్ మండల కార్యాలయంపై పార్టీ శ్రేణులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరిపించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

పార్టీ, ఎమ్మార్వో ఆఫీసుల్లో భాజపా జాతీయ జెండా ఆవిష్కరణ
పార్టీ, ఎమ్మార్వో ఆఫీసుల్లో భాజపా జాతీయ జెండా ఆవిష్కరణ

By

Published : Sep 17, 2020, 2:15 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా భాజపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఖిలా వరంగల్ మండల కార్యాలయంపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాషాయ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

పార్టీ, ఎమ్మార్వో ఆఫీసుల్లో భాజపా జాతీయ జెండా ఆవిష్కరణ

తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ పతాకం..

ఈ క్రమంలోనే కొంతమంది పార్టీ నాయకులు కార్యాలయంపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు ఖిలా వరంగల్ కోట ఎమ్మార్వో కార్యాలయం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు.

పార్టీ, ఎమ్మార్వో ఆఫీసుల్లో భాజపా జాతీయ జెండా ఆవిష్కరణ

ఇవీ చూడండి : పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details