తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

భాజపా ఎదుగుదలను చూసి ఓర్వలేకే మంత్రి కేటీఆర్... విమర్శలు చేస్తున్నారని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి వరంగల్​లో అన్నారు. రాష్టానికి కేంద్రం నిధులు ఇస్తున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'
'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

By

Published : Nov 9, 2020, 6:48 PM IST

హైదరాబాద్​లో వరద బాధితులకు ఇంటికి రూ.10 వేలు అందిస్తున్నారు కానీ.. వరంగల్​లో ఎందుకు ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

గ్రేటర్ ఎన్నికలు ఉండటం వల్లనే ప్రజలకు ఆర్థిక సాయం పంపిణీ చేశారని విమర్శించారు. వరంగల్​లో వరద బాధితులను ఆదుకున్నామని చెప్పిన కేటీఆర్... ఎక్కడ ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. వరంగల్​లో వరద బాధితులకు తక్షణమే రూ.20 వేలు చొప్పున పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో తెరాస నాయకులను కాలనీల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'మీరు రాజీనామా చేస్తామంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details