ఎర్రబెల్లి తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ల భజన చేసుకోవచ్చునని.. కానీ వరంగల్ ప్రజల పరువు తీయవద్దని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆక్షేపించారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కళాకారుల వర్గాలు కలిసి పోరాడితేనే రాష్ట్రం ఏర్పడిందనే విషయం.. మంత్రి కప్పిపుచ్చితే దాగేది కాదన్నారు.
'అన్ని వర్గాలు కలిసి పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది' - భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి
ఉద్యమ సమయంలో ఎర్రబెల్లి తెదేపా వైపు నిలబడి.. పోరాటాన్ని అణచివేయాలని చూశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి చూపేలా ప్రసంగాలు చేస్తే ప్రజల దృష్టిలో చులకనకాక తప్పదన్నారు.
'అన్ని వర్గాలు కలిసి పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది'
ఉద్యమ సమయంలో ఎర్రబెల్లి తెదేపా వైపు నిలబడి.. పోరాటాన్ని అణచివేయాలని చూశారని రాకేశ్ ఆరోపించారు. అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి చూపేలా ప్రసంగాలు చేస్తే ప్రజల దృష్టిలో చులకనకాక తప్పదన్నారు.