వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి. వలస కూలీలకు మధ్యాహ్నం భోజన పొట్లాలు అందజేస్తూ కూలీల ఆకలి తీరుస్తున్నారు.
వంగపహాడ్లో భాజపా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి నిరుపేదలకు కూరగాయల పంపిణీ
వంగపహాడ్ గ్రామంలో నిరుపేదలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా గ్రామీణ ప్రాంతాలల్లో రోజువారీగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.

భాజపా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ
ఆపత్కాల పరిస్థితుల్లో పేదలకు బాసటగా ఉండాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాలల్లో పేదలకు పార్టీ శ్రేణులు చేయూత ఇందిస్తున్నారని రాకేశ్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
ఇదీ చూడండి:నేతన్నల యాతన... వైరస్ వ్యాప్తితో కష్టాలు!