తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​ - telangana varthalu

ఓరుగల్లులో అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వెల్లడించారు. కమలం పార్టీ పూర్తి మెజార్టీతో గెలబోతోందన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని పేర్కొన్నారు.

ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​
ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​

By

Published : Apr 24, 2021, 6:02 PM IST

Updated : Apr 24, 2021, 6:37 PM IST

ఓరుగల్లులో భాజపా పూర్తి మెజార్టీతో గెలవబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయన్న సంజయ్​... ప్రభుత్వంపై కొట్లాడే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. భాజపా నుంచి ఒక్క కార్పొరేటర్ ఉన్న ఓరుగల్లుకు కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని ఆయన చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చించిందని... దీనిపై తెరాస ప్రజాప్రతినిధులు చర్చకు సిద్ధమేనా...అంటూ సవాల్ విసిరారు. నిధులు ఇచ్చి నాణ్యతతో పనులు చేసే పార్టీ భాజపా అని పేర్కొన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని బండి సంజయ్​ వెల్లడించారు.

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస గూండాలను, నేరస్థులను అభ్యర్థులుగా ఎంపిక చేశారని సంజయ్ ఆరోపించారు. ఇందుకు వరంగల్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి, మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో స్ధానిక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారని... సీఎం అండతోనే తెరాస ప్రజాప్రతినిధులంతా దోచుకుంటున్నారని హన్మకొండలో అన్నారు. ఓరుగల్లులో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులతో గెలవాలనుకుంటున్న తెరాస కుట్రలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు.

ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​

ఇదీ చదవండి:పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​

Last Updated : Apr 24, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details