Bandi Sanjay fire ON CM KCR కేసీఆర్కు ధైర్యముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తారని మండిపడ్డారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్పై నిప్పులు చెరిగారు.
భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారుని బండి సంజయ్ మండిపడ్డారు. భాజపా మాత్రం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం 1400 మంది ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్లు కేసీఆర్ వచ్చి చేరారని ధ్వజమెత్తారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. డిండి ప్రాజెక్టును తెరాస సర్కారు నిర్లక్ష్యం చేసిందన్న బండి సంజయ్.. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల హామీ ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
కేసీఆర్కు ధైర్యముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలి. ప్రతి చేతికి పని..ప్రతి చేనుకు నీరు భాజపా సిద్ధాంతం. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ఈ వేదికగానే ప్రకటిస్తున్నాం. సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం.చిన్న వర్షానికే హైదరాబాద్, వరంగల్ మునిగిపోతోంది.కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవు.కేసీఆర్ కుటుంబంపై దిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. కుంభకోణం ఏదైనా కేసీఆర్ కుటుంబానికి లింకులు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, వరంగల్ మునిగిపోతోంది:భాజపా కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారని బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలు పనిచేశారని ప్రశంసించారు. పోలీసులకు భాజపా ఎప్పడూ వ్యతిరేకంగా కాదన్నారు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు భాజపా సిద్ధాంతమని బండి సంజయ్ స్పష్టం చేశారు. చిన్న వర్షానికే హైదరాబాద్, వరంగల్ మునిగిపోతోందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవని మండిపడ్డారు.