నిధులిచ్చే వాళ్లు కావాలో.. కబ్జాలు చేసే వాళ్లు కావాలో వరంగల్ ప్రజలే తేల్చుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు గ్రేటర్ వరంగల్‌లో ఆయన పర్యటించారు. ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేస్తే తెరాస నాయకులు జేబులు నింపుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కబ్జాలు చేసే వాళ్లు కావాలా, అభివృద్ధి కావాలా ప్రజలే నిర్ణయించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో రోడ్ షో నిర్వహించారు.
వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నగరంలోని పలు డివిజన్లలో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తేనే వరంగల్ అభివృద్ధి చెందిన విషయాన్ని నగరవాసులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికార తెరాస నాయకులు నిధులతో జేబులు నింపుకున్నారే తప్ప.. చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి నినాదంతో భాజపా ముందుకెళ్తోందని తెలిపారు. ఒకసారి వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తే ఎవరూ ఏం చేశారో తెలుస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.