తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి - బండి సంజయ్​ వార్తలు

దేశంలో పేదరికం ఉండకూడదని అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్​లో అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని చెప్పారు.

bjp state president bandi sanjay comments on cm kcr in warangala urban district
ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి

By

Published : Jan 22, 2021, 7:45 PM IST

రెండేళ్లుగా ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు అమలు కాక అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారని తెలిపారు. అగ్రవర్ణాల్లో పేదరికం లేకుండా ప్రధాని మోదీ రిజర్వేషన్లు అమలు చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని రోజులు అమలు చేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని హరిత హోటళ్లో అగ్రవర్ణాల పేదలు బండి సంజయ్​ను కలిశారు. అగ్రవర్ణాల్లోని పేదలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్​ అన్నారు.

కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్​ కాళేశ్వరం పర్యటనకు వెళ్లారని అన్నారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫామ్ హౌస్​లో దోష నివారణ పూజ చేసి.. నిర్మల్యాన్ని కాళేశ్వరంలోని త్రివేణి సంఘమంలో కలిపారాని ఆరోపించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు.

యాక్షన్​లో కేసీఆర్​ను మించిన నటుడు లేడని.. కేసీఆర్ ను పెట్టి సినిమా తీస్తే టేకాఫ్ లేకుండా 20 గంటల్లో సినిమా తీయవచ్చని ఎద్దేవా చేశారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద మోదీ చిత్ర పటానికి బండి సంజయ్ పాలాభిషేకం చేశారు.

ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి

ఇదీ చదవండి:ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details