తెలంగాణ

telangana

ETV Bharat / state

ETELA RAJENDER: హుజూరాబాద్‌లో తెరాసకు డిపాజిట్ కూడా దక్కదు: ఈటల - telangana varthalu

ఒక్క వ్యక్తిని ఓడించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎన్ని అప్రజాస్వామిక పద్ధతులను ప్రయోగించినా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి జన ఆశీర్వాద సభలో కమలాపూర్‌లో ఈటల పర్యటించారు.

ETELA RAJENDER: హుజూరాబాద్‌లో తెరాసకు డిపాజిట్ కూడా దక్కదు: ఈటల
ETELA RAJENDER: హుజూరాబాద్‌లో తెరాసకు డిపాజిట్ కూడా దక్కదు: ఈటల

By

Published : Aug 20, 2021, 7:32 PM IST

హుజూరాబాద్‌లో ఎన్ని అప్రజాస్వామిక పద్ధతులను ప్రయోగించినా.. గెలుపు తమదేనని భాజపా నేత ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి జన ఆశీర్వాద సభలో కమలాపూర్‌లో ఈటల పర్యటించారు. హుజూరాబాద్‌లో తెరాసకు డిపాజిట్ కూడా దక్కవని ఈటల జోస్యం చెప్పారు.

హుజూరాబాద్‌ ప్రజలు తెరాసకు వాత పెట్టడం ఖాయమని ఈటల రాజేందర్​ అన్నారు. ఒక్క వ్యక్తిని ఓడించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలకు హుజూరాబాద్ ఉపఎన్నిక రిహార్సల్‌ లాంటిదని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ పేర్కొన్నారు.

సవాల్​ చేస్తున్నా..

ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మచ్చలాగా, చీకటి కోణంలాగా, చీకటి అధ్యాయం లాగా కేసీఆర్​ నియంతృత్వ పాలన, పోలీసుల రాజ్యం, అధికారుల రాజ్యం కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కేసీఆర్​ కాదు కదా.. కేసీఆర్​ జేజమ్మ దిగివచ్చినా గెలవలేరు. ఇప్పటికే ఇక్కడ వందల కోట్లు ఖర్చు పెట్టారు. నేను సవాల్​ చేస్తున్నా... నీకు కనుక దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి. హుజూరాబాద్​లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని హెచ్చరిస్తా ఉన్నా. ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నరు. -ఈటల రాజేందర్​, భాజపా నేత

ETELA RAJENDER: 'హుజూరాబాద్‌ ప్రజలు తెరాసకు వాత పెట్టడం ఖాయం'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details