తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం: రాంచందర్​రావు - parakala mla challa dharma reddy case

తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యే ఇంటిపై దాడికి సంబంధించి తమ పార్టీ వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

bjp mlc ramchander rao fires on kcr government
భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు

By

Published : Feb 4, 2021, 9:52 AM IST

రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. భాజపా కార్యాలయంపై, ఎంపీ ధర్మపురి అర్వింద్​పై దాడి చేసిన వారిపై పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యే ఇంటిపై దాడికి సంబంధించి తమ పార్టీవారిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై దాడి చేసిన కేసులో వరంగల్ కేంద్ర కారాగారం నుంచి బెయిల్​పై విడుదలైన భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సహా 43 మందిని రాంచందర్ రావు పరామర్శించారు. అనంతరం హన్మకొండలోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details