నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. భాజపా అభ్యర్థి ఎలిమినేషన్ పూర్తైంది. ప్రస్తుతం ఇప్పటివరకు తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,38,683 ఓట్లు రాగా... స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,08,104 ఓట్లు వచ్చాయి.
భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ - నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పటివరకు తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,38,683 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,08,104 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ పూర్తైంది.
భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్
భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లు...పై స్థానంలో ఉన్న ముగ్గురికి బదిలీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ తొలగింపు పూర్తి కాగా... ఆ వెంటనే ప్రేమేందర్ ఓట్ల బదలాయింపు పూర్తి చేశారు.
ఇదీ చూడండి :ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల పరుగులు