ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఓరుగల్లు వాసులు క్షీరాభిషేకం నిర్వహించారు. పీఎం కేర్ నిధుల ద్వారా ఉత్తర తెలంగాణకు తలమానికమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 48 వెంటిలేటర్లు అందించారని మోదీకి భాజపా నాయకులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
ఎంజీఎంకు వెంటిలేటర్లు.. ప్రధానికి క్షీరాభిషేకం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పీఎం కేర్స్ నిధి ద్వారా 48 వెంటిలేటర్లు అందించిన ప్రధాని నరేంద్రమోదీకి భాజపా నాయకులు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంజీఎంకు వెంటిలేటర్లు.. ప్రధానికి క్షీరాభిషేకం
కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ కరోనా బారిన పడినవారికి మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్లు అందించినట్లు వారు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ప్రధాన గేటు వద్ద మోదీ చిత్రపటానికి భాజపా శ్రేణులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'