అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ ఆధ్వర్యంలో నగరంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో భాజపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్ రామాలయంలో ప్రత్యేక పూజలు - వరంగల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భాజపా నాయకులు
అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసిన నేపథ్యంలో వరంగల్ నగరంలోని పలు రామాలయాల్లో భాజపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకరికొకరు మిఠాయిలు తినింపిచుకుని వేడుకలు చేసుకున్నారు.
![వరంగల్ రామాలయంలో ప్రత్యేక పూజలు bjp leaders special worships at temples in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8305345-373-8305345-1596629960906.jpg)
అయోధ్యలో భూమిపూజ.. వరంగల్ రామాలయంలో ప్రత్యేక పూజలు
అనంతరం శ్రీరామ నామస్మరణ, భజన కార్యక్రమాలు జరిపించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు.
ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక