రాష్ట్రంలో తెరాస నిరంకుశ పాలనను, బండి సంజయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే కారణమని భాజపా నాయకులు మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆపార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
'గంగుల శ్రీనివాస్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణం' - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్త
గంగుల శ్రీనివాస్ మృతికి రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే కారణమని భాజాపా నాయకులు ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరులో కేసీఆర్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించారు.
'గంగుల శ్రీనివాస్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణం'
కరోనా వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారినా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోలేదని భాజపా మండల అధ్యక్షుడు పృథ్విరాజ్‌గౌడ్ మండిపడ్డారు. తెరాస సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:గంగుల శ్రీనివాస్ మరణం ఎంతగానో బాధిస్తోంది: బండి సంజయ్