భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియామకం కావడం వల్ల వరంగల్‌లో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టపాసులు పేల్చుతూ సందడి చేశారు. వరంగల్ అర్బన్ భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శ్రేణులు స్వీట్లు పంచారు.
వరంగల్‌లో భాజపా శ్రేణుల సంబురాలు - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వార్తలు
వరంగల్‌లో భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్‌లో భాజపా శ్రేణుల సంబురాలు
బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో కమలం పార్టీ బలోపేతం అవుతుందని పద్మ అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ సరైన న్యాయం చేస్తుందని తెలిపారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం