గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ భాజపాకు చెందిన అభ్యర్థి సెల్ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన చేయడం స్థానికంగా కలకలం రేపింది. 34వ డివిజన్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన బైరి శ్యామ్ తెరాస అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు అనంతరం స్వల్ప మెజార్టీతో శ్యామ్ గెలిచాడని ప్రకటించగా.. తెరాస అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
అదే రోజు తిరిగి ఓట్లను లెక్కించగా.. 11 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి కుమారస్వామి గెలుపొందారని అధికారులు సర్టిఫికేట్ అందజేశారు. సద్దుమణిగింది అనుకున్న వివాదం.. శ్యామ్ టవర్ ఎక్కి ఆందోళన చేయడం వల్ల వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నాయకులు అధికారులతో చరవాణిలో సంభాషించి.. తన ఓటమికి కారకులయ్యారని ఆరోపించారు.