వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా శ్రేణులు వరంగల్లో ఆందోళనకు దిగాయి. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతృత్వంలో వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
'రూ. పదివేల వరద సాయం ఇక్కడ కూడా ఇవ్వాలి' - వరద సాయం అందించాలని వరంగల్లో భాజపా ధర్నా
వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా అయితే వరద సాయం అందించారో అదే రీతిలో ఇక్కడ కూడా సాయం అందించాలని నేతలు నిరసన చేపట్టారు.
'వరంగల్లో వరద బాధితులకు రూ. పదివేల సాయం అందించాలి'
అక్టోబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరంగల్లోనూ చాలా మంది వరదల్లో చిక్కుకుపోయారని కార్యకర్తలు అన్నారు. హైదరాబాద్లో వరద బాధితులకు ఏ విధంగా అయితే ప్రభుత్వం రూ. 10వేల ఆర్థిక సాయం అందించిందో అదే తీరుగా ఇక్కడ కూడా సాయం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో కూడలి వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:కొవిడ్ వ్యాక్సిన్ భారత్లో తయారవడం గర్వకారణం: దత్తాత్రేయ