వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సోదరుడు భూపాల్‌రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.
పేకాటలో దొరికిన భూపాలపల్లి ఎమ్మెల్యే తమ్ముడు భూపాల్‌రెడ్డి - కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్
వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలోని ఓ ఇంటిపై దాడి నిర్వహించిన పోలీసులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డి సహా ఆరుగురు పట్టుబడ్డారు.
హన్మకొండలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
గండ్ర వెంకటరమణా రెడ్డి సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డితో సహా ఆరుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి 7 చరవాణులు, 2,78, 990 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్న అనంతరం అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పేకాట శిబిరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పక్కా సమాచారం తీసుకున్న పోలీసులు దాడులు చేస్తున్నారు.