తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రకాళి ఆలయంలో కన్నుల పండువగా వసంత నవరాత్రి ఉత్సవాలు - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు

శ్రీ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చామంతి పూలతో లక్ష పుష్పార్చన జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

bhadrakali vasantha navaratri, bhadrakali laksha pushparchana
భద్రకాళి లక్షపుష్పార్చన, భద్రకాళి వసంత నవరాత్రులు

By

Published : Apr 20, 2021, 5:38 PM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. చామంతి పూలతో లక్ష పుష్పార్చన జరిపారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.

ఇదీ చదవండి:భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా భేరి పూజ

ABOUT THE AUTHOR

...view details