ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని అర్చకులు శనివారం సాయంత్రం మూసివేశారు. సూర్యగ్రహణం సందర్భంగా ప్రదోషకాల పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేశారు.
సూర్యగ్రహణ ప్రభావం.. భద్రకాళీ అమ్మవారి ఆలయం మూసివేత - వరంగల్లోని భద్రకాళీ ఆలయం మూసివేత వార్తలు
సూర్యగ్రహణం సందర్భంగా వరంగల్లోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

భద్రకాళీ అమ్మవారి ఆలయం మూసివేత
ఆదివారం ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి సూర్యగ్రహణం మొదలవుతుందని మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుందని ఆలయ అర్చకులు సత్యం తెలిపారు. గ్రహణం సందర్భంగా భక్తులెవరికీ అనుమతి లేదని వివరించిన అర్చకులు.. సోమవారం సంప్రోక్షణ అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.