వరంగల్ అర్బన్ జిల్లా ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు.
8వ రోజుకు భద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు - Bhadrakali Kalyana Brahmotsavalu in warangal district
భద్రకాళి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరాయి. కరోనా ఉద్ధృతి, లాక్డౌన్ నేపథ్యంలో ఉత్సవాలను అర్చకులు ఏకాంతంగా జరుపుతున్నారు.
![8వ రోజుకు భద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు Bhadrakali Kalyana Brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-22-17h09m56s972-2205newsroom-1621683628-107.jpg)
Bhadrakali Kalyana Brahmotsavalu
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చకులు డోలోత్సవం నిర్వహించారు. త్వరలో కరోనా మహమ్మారి అంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ప్రధానార్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్ శేషు తెలిపారు.
ఇదీ చదవండి:'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'