ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు. భద్రకాళి అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
సూర్యప్రభ వాహనంపై శ్రీ భద్రకాళీ అమ్మవారు - wgl
వరంగల్లో శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని ఊరేగించారు.

శ్రీ భద్రకాళీ అమ్మవారు