ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. సాయంత్రం సర్వభూపాల సేవ నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.
మహిషాసుర మర్దిని అలంకారంలో భద్రకాళి అమ్మవారు - మహిషాసుర మర్దిని అలంకారంలో భద్రకాళి అమ్మవారు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారు నేడు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మహిషాసుర మర్దిని అలంకారంలో భద్రకాళి అమ్మవారు