Beer Party at Government Hospital: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది, బాధ్యత మరిచి వ్యవహరించారు. వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆసుపత్రిలోని ఓ గదిలో బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బీర్ పార్టీ.. అసలేం జరిగిందంటే..! - ప్రభుత్వ ఆసుపత్రి
Beer Party at Government Hospital: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు మహిళా సిబ్బంది, బాధ్యత రహితంగా వ్యవహరించారు. వీరితో పాటుగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆసుపత్రిలో, పుట్టినరోజు వేడుకల పేరిట బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు.
![ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బీర్ పార్టీ.. అసలేం జరిగిందంటే..! Govt Maternity Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16755914-289-16755914-1666850549330.jpg)
Govt Maternity Hospital
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు వారి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల పేరిట ఆసుపత్రిలో బీర్లు తాగారు. వీరు విందు చేసుకొనే దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలిసింది. వారు మహిళ సిబ్బందిని పిలిపించి మందలించి వదిలేశారు.
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బీర్ల విందు.. అసలేం జరిగిందంటే..!
ఇవీ చదవండి: