కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో దీక్ష చేపట్టారు. బడా నాయకులకు కరోనా సోకితే కార్పోరేట్ ఆస్పత్రిలో.. పేదలకు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించడం ప్రభుత్వానికి సబబేనా అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం దీక్ష - జాజుల శ్రీనివాస్ గౌడ్
కరోనా వ్యాధిని కూడా ఆరోగ్య శ్రీలో చేర్చి.. పేదవారికి సైతం చికిత్స ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వైరస్ నివారణ చర్యలు చేపట్టాలని, కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం దీక్ష
కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా రాష్ట్ర రాజధానిలో 50వేల పడకలతో, జిల్లా కేంద్రాల్లో ఐదువేల పడకలతో ఆస్పత్రులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని వైరస్ నిర్మూలనకోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఇంచార్జి వేణుగోపాల్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'