వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం వనమాలకనపర్తి గ్రామంలో కోట పూర్ణచందర్ లావణ్య దంపతుల కూతురు సహస్ర ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నీటి సంపులో పడి చిన్నారి మృతి - వరంగల్ అర్బన్ జిల్లా వనమాలకనపర్తి గ్రామంలో చిన్నారి మృతి
వరంగల్ అర్బన్ జిల్లా వనమాలకనపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు పాప తల్లిదండ్రులు.
నీటి సంపులో పడి చిన్నారి మృతి
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ మృతిచెందడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతురాలి తండ్రి అదే గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. వీరి స్వగ్రామం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామం.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'