తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు వైభవం 'బతుకమ్మ పండుగ' - batukamma-festival-for-telangana

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండ వేయి స్తంభాల గుడిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు  శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ తల్లి ఆవిర్భావం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణకు వైభవం 'బతుకమ్మ పండుగ'

By

Published : Sep 28, 2019, 11:54 PM IST

బతుకమ్మ పండుగ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని....దేశ విదేశాల్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని... పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రకృతిని పూజించే పండుగ ఇదేనని చెప్పారు. ఏపీలో వచ్చే ఏడాది నుంచి ఘనంగా వేడుకలు జరుగుతాయని తెలిపారు. హన్మకొండ వేయి స్తంభాల గుడిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్​తో కలసి.....వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. బతుకమ్మ తల్లి ఆవిర్భావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రూ.303 కోట్లతో మహిళలకు చీరలిచ్చి కేసీఆర్ అన్న అయ్యారని అభిప్రాయపడ్డారు. చారిత్రక ప్రదేశంలో వేడుకలు ప్రారంభించడం గర్వకారణంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడాల హరికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు వైభవం 'బతుకమ్మ పండుగ'

ABOUT THE AUTHOR

...view details