తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించారని... ఆడపడుచులకు పెద్ద అన్నగా బతుకమ్మ పండుగకు సారె పెడుతున్నారని కొనియాడారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
'ఆడపడుచులకు పెద్ద అన్నగా కేసీఆర్ సారె పెడుతున్నారు' - వరంగల్ అర్బన్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తన కుటుంబంగా భావించి... ఆడపడుచులకు పెద్ద అన్నగా బతుకమ్మ పండుగకు సారె పెడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. అందరూ కొత్త చీరతో బతుకమ్మ ఆడాలన్నదే కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
!['ఆడపడుచులకు పెద్ద అన్నగా కేసీఆర్ సారె పెడుతున్నారు' bathukamma-sarees-distribution-in-warangal-urban-district-by-mla-ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9110702-992-9110702-1602236218769.jpg)
'ఆడపడుచులకు పెద్ద అన్నగా కేసీఆర్ సారె పెడుతున్నారు'
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక కోసం రూ.317కోట్లతో 287రకాల డిజైన్లతో కోటి చీరలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంతటి పేదవారైనా కొత్త చీరతో బతుకమ్మ ఆడాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. కేవలం బతుకమ్మ పండుగకే కాకుండా రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చే సంస్కృతీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:గుడ్డు వినియోగంపై మరింత అవగాహన కల్పించాలి: సురేశ్ చిట్టూరి
TAGGED:
బతుకమ్మ చీరల పంపిణీ