వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి.. మహిళలంతా ఆట పాటలతో ఆనందంగా గడిపారు. చిన్నారులు, మహిళలు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.
ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన మహిళలు
వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చిన్నారులు, పెద్దలు కలిసి గౌరమ్మకు వీడ్కోలు పలికారు.
ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన మహిళలు
కరోనా నేపథ్యంలో ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి.. ఆత్మగౌరవంతో పండుగలు జరుపుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్